పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడు అరెస్ట్ లో బిగ్ ట్విస్ట్..కాంగ్రెస్ చేరనందుకేనా !?

-

పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ తెల్లవారుజామున పటాన్చెరులోని ఆయన నివాసానికి వచ్చిన పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ కేసులో ఆయణ్ను అరెస్టు చేసినట్లు చెప్పారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Gudem Madhusudhan Reddy arrested

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లగ్దారం గ్రామంలో మైనింగ్ చేసేందుకు మధుసూదన్ రెడ్డికి చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లయ్ కంపెనీ క్వారీనీ తవ్వుతోంది. కేంద్ర పర్యావరణ నిబంధనలు ఉల్లగించి పరిమితికి మించి తవ్వకాలు జరపడం, అనుమతుల గడువు అయిపోయినా మైనింగ్ చేశారని ఇటీవల క్వారీని అధికారులు సీజ్ చేశారు. అయితే.. ఈ కేసులో తాజాగా కొత్త విషయం బయటకు వచ్చింది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిను కాంగ్రెస్‌ పార్టీ చేరాలని ఒత్తిళ్లు వచ్చాయట. అయితే..దీనికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఒప్పుకోలేదట. ఈ తరుణంలోనే.. మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారని చెబుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news