ఏజెంట్ మోసం చేశాడని సోషల్ మీడియాలో గల్ఫ్ బాధితుడి ఆవేదన

-

ఈ మధ్య కాలంలో ఎక్కువగా మోసాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎక్కువగా మోసపోయే వాళ్లు ఉన్నంత వరకు మోసం చేస్తూనే ఉంటారు. ఇది జగమెరిగిన సత్యం. ప్రధానంగా విదేశాలకు పంపిస్తామని మాయ మాటలు చెప్పి మోసం చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ మోసాలపై చర్యలు తీసుకోవాలని బాధితులు పేర్కొంటున్నారు.

తాజాగా ఓ గల్ఫ్ బాధితుడు మోసపోయాడు. ఏజెంట్ మోసం చేశాడని సోషల్ మీడియాలో గల్ఫ్ బాధితుడి ఆవేదన వ్యక్తం చేశాడు.  తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతపూర్‌కు చెందిన శ్రీనివాస్ గౌడ్ ఏడాది క్రితం దుబాయ్ వెళ్లాడు. తనను ఏజెంట్ మోసం చేశాడని వాపోయాడు. తన పాస్ పోర్ట్, డాక్యుమెంట్స్ పాకిస్తాన్ వ్యక్తులకు ఇచ్చాడని, అక్కడ ఓ రూమ్ లో బంధించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు సాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news