తెలంగాణ వ్యాప్తంగా గురుకుల పాఠశాలలకు తాళాలు పడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు, వసతి గృహాలకు తాళాలు వేస్తున్నారట ఆయా బిల్డింగ్ యజమానూలు. ముఖ్యంగా తుంగతుర్తి, బెల్లంపల్లి, తాండూరు, వరంగల్, భూపాలపల్లి, హుజూర్ నగర్లలో పాఠశాలలు మరియు వసతి గృహాలకు తాళాలు వేసినట్లు సమాచారం అందుతోంది.
దీంతో దసరా సెలవులు ముగియడంతో విద్యార్థులు, టీచర్లు వచ్చి.. చూస్తే.. వాటికి తాళాలు ఉన్నాయి. దీంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. దీనిపై కేటీఆర్ స్పందించారు. ఢిల్లీకి మూటలు పంపేందుకు పైసలు ఉన్నాయి… కమిషన్లు వచ్చే బడా కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులకు వేల కోట్లు ఉన్నాయి కానీ.. పేద విద్యార్థుల చదువుకునే గురుకులాల అద్దెలు చెల్లించడానికి పైసలు లేవా ?? అంటూ నిలదీశారు. సిగ్గు, సిగ్గు….. ఇది గురుకులాలు శాశ్వతంగా మూసివేసే కుట్ర లాగా కనబడుతున్నదని ఆగ్రహించారు కేటీఆర్.
గురుకులానికి తాళం
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని జ్యోతిరావు పూలే పాఠశాల అద్దె కొన్ని నెలలుగా చెల్లించడం లేదని గేట్లకు తాళం వేసిన భవన యజమాని.
ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని, అప్పుడే తాళం తీస్తామని భవన యజమాని డిమాండ్. https://t.co/WyGGhiVoZe pic.twitter.com/XOkbVFOnn0
— Telugu Scribe (@TeluguScribe) October 15, 2024