తెలంగాణ కానిస్టేబుళ్లకు షాక్ ఇచ్చింది రేవంత్‌రెడ్డి సర్కార్. ఇక పై నెలకు ఒకసారే ఇంటికి వెళ్లేలా రూల్స్ మార్చేసిందట. ఇదే విషయంపై ట్విట్టర్ లో మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. పోలీస్ కానిస్టేబుల్ లకు జరుగుతున్న శ్రమదోపిడి గురించి నాడు అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఊసరవెల్లిలా శ్రమ దోపిడి విధానాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహించారు. టిఎస్ఎస్పీ కానిస్టేబుళ్ళు 15 రోజులకు ఒకసారి బదులు నెలకు ఒకసారి ఇంటికి వెళ్లేలా లీవ్ మాన్యువల్ మార్చడం దుర్మార్గం అంటూ ఫైర్ అయ్యారు.
వారాల పాటు కుటుంబాలకు దూరం చేయడమేనా మీరు పోలీసులకు ఇచ్చిన దసరా, దీపావళి కానుక అంటూ సీఎం రేవంత్‌పై సెటైర్లు పేల్చారు హరీష్‌రావు. హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారూ.. టిఎస్ఎస్పీ కానిస్టేబుళ్లకు నెలకొకసారి లీవు విధానం అమలు చేయకుండా, ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని BRS party పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సివిల్, ఏఆర్ ఇతర విభాగాల పోలీసులకు 15 రోజుల టిఏ ఇచ్చేదని… కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడు రోజులకు దాన్ని కుదించిందని మండిపడ్డారు. వారి పొట్ట కొట్టకుండా పాత విధానం ప్రకారమే 15 రోజుల టీఏ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
పెండింగ్ లో ఉన్న టిఏ, ఎస్ఎల్, జిపిఎఫ్ లను వెంటనే విడుదల చేయాలని… రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల సరెండర్ లీవ్ ఎన్ క్యాష్మెంట్ పెండింగ్ డబ్బులు చెల్లించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే క్లియర్ చేయాలని కోరారు హరీష్ రావు. సివిల్ పోలీసులు వినియోగించే వాహనాల డీజిల్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ ప్రభుత్వం పోలీస్‌స్టేషన్ నిర్వహణ కోసం మండల పోలీసు స్టేషన్ కు 25,000 పట్టణానికి 50,000 హైదరాబాదులో అయితే 75,000 ఇచ్చేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోలీస్ స్టేషన్ నిర్వాణ కోసం నిధులు విడుదల చేయడం లేదని మండిపడ్డారు.
పోలీస్ కానిస్టేబుల్ లకు జరుగుతున్న శ్రమదోపిడి గురించి నాడు అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఊసరవెల్లిలా శ్రమ దోపిడి విధానాన్ని అమలు చేస్తున్నారు.
టిఎస్ఎస్పీ కానిస్టేబుళ్ళు 15 రోజులకు ఒకసారి బదులు నెలకు ఒకసారి ఇంటికి వెళ్లేలా లీవ్ మాన్యువల్ మార్చడం… pic.twitter.com/wozVJqUDD3
— Harish Rao Thanneeru (@BRSHarish) October 15, 2024