అమెరికాలో హనుమకొండ విద్యార్థి మృతి..!

-

ఉన్నత చదువుల కోసం యుఎస్ఏ కు వెళ్లిన ఏరుకొండ రాజేష్ అనే హనుమకొండ విద్యార్థి మృతి చెందాడు. అతని మృతదేహం కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపులు చుస్తున్నారు. రాజేష్ తండ్రి 9 నెలల క్రితం మృతి చెందాడు. అయితే ప్రస్తుతం రాజేష్ మృతదేహం కోసం తల్లి కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టిస్తున్నాయి. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన ఏరుకొండ రాజేష్ 2015లో ఎమ్మెస్ ట్రైనింగ్ చేసేందుకు యూఎస్ఏకు వెళ్ళాడు. 9సంవత్సరాలుగా అక్కడే ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

రాజేష్ మూడు రోజుల క్రితం మృతి చెందినట్లు అక్కడి నుండి ఫోన్ ద్వారా సమాచారం రావడంతో గుండెలు బాదుకుంటూ దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు ఇంటి వద్ద రోదిస్తున్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ఆర్థిక ఇబ్బందులతో ఉన్న రాజేష్ తల్లి ఏం చేయాలో తెలియక కన్నీరు మున్నిరు అవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పరంగా రాజేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని రాజేష్ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version