హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలకు వేధింపులు..రాత్రుళ్లు రూంలోకి వెళ్లి !

-

హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో దారుణం చోటు చేసుకుంది. స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపైన లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు ఓ అధికారి. బాలికలను నిత్యం వేధింపులకు గురి చేస్తున్న ఆ అధికారి..బాలికల గదిలోకి అర్ధరాత్రి చోరబడుతున్నాడట. సాయంత్రం సమయంలో ఆట విడుపు పేరుతో వికృతి చేష్టలకు దిగుతున్నాడట ఆ అధికారి.

ఆట విడుపు పేరుతో కారులో బాలికలను ఎక్కించుకొని అసభ్య ప్రవర్తనకు పాల్పడుతున్నాడట. దీంతో లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధికారిపై ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదంటున్నారు బాలికలు. ఉన్నతాధికారుల అండదండలతో వేధింపులకు పాల్పడుతున్నాడని బాలికలు చెబుతున్నారు. అయితే.. తాజాగా ఈ సంఘటనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు బాలికలు. దీంతో స్పోర్ట్స్ స్కూల్ ఘటనపై స్పందించిన ప్రభుత్వం..బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధికారిని సస్పెండ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news