ప్రసవాల విషయంలో తెలంగాణ సరికొత్త చరిత్ర : మంత్రి హరీశ్‌రావు

-

ప్రసవాల విషయంలో రాష్ట్రం చరిత్ర సృష్టించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. 2021-22 సంవత్సరానికిగాను వంద శాతం ఇన్‌స్టిట్యూషన్‌ డెలివరీలు సాధించినట్టు చెప్పారు. తెలంగాణ వైద్యరంగం దేశానికే ఆదర్శంగా ఉందని అన్నారు. కేసీఆర్ కిట్ల పంపిణీ ఇన్‌స్టిట్యూషనల్ ప్రసవాల సాధనకు ఉపయోగపడిందని తెలిపారు.

అతితక్కువ గర్భస్రావాలు జరుగుతున్న రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. 80.75శాతం చిన్నారులకు పుట్టిన తొలిగంటకే తల్లిపాలు అందిస్తున్నట్టు హరీశ్‌ రావు వివరించారు. పుట్టిన పిల్లలకు 104 శాతం హెపటైటిస్ వ్యాక్సిన్‌తోపాటు మీజిల్స్, రూబెల్లా వ్యాక్సిన్లు వందశాతం అందిస్తున్నామని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన ఆరోగ్య తెలంగాణ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు.

మరోవైపు రాష్ట్రంలో పేద వాళ్లకు కూడా కార్పొరేట్ తరహా వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నట్లు హరీశ్ రావు పునరుద్ఘాటించారు. అందరికీ వైద్యం అందేలా బస్తీ దవాఖానాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news