మెదక్, సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తానన్న కాంగ్రెస్ కు ఓటు వేయకండి – హరీష్ రావు

-

మెదక్, సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తానన్న కాంగ్రెస్ కు ఓటు వేయకండి అని పిలుపునిచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. గజ్వేల్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ…. మెదక్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. మెదక్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తన మూర్ఖత్వాన్ని మరోసారి చాటుకున్నాడు….మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసహనం వ్యక్తం చేస్తున్నాడని ఆగ్రహించారు.

harish rao vs revanth

ప్రతిపక్షంలో ఉండగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి గజ్వేల్‌లో మెదక్ జిల్లాలో మాత్రమే జరిగిందని చెప్పి, ఇప్పుడు ఇంకా అభివృద్ధి కాలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు.
ఇందిరాగాంధీ మెదక్‌కి ఏం చేసింది? మెదక్‌లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది, రైల్వే లైన్ తెచ్చింది కేసీఆర్ అని కొనియాడారు.

మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండు. మూడు యూనివర్సిటీలు తెచ్చిండన్నారు. మెదక్‌లో ఏం అభివృద్ధి జరిగిందో కళ్లు పెద్దవి చేసి చూడు రేవంత్. లేకపోతే నువ్వొస్తే నేను చూపిస్తానని…సవాల్‌ చేశారు. మెదక్, సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తా అంటున్న నువ్వు ఈరోజు మా జిల్లా గురించి మాట్లాడుతావా? అంటూ నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news