ఏపీలో ఆ పార్టీకే ఓటు వేయండి – చిరంజీవి సంచలన ప్రకటన !

-

మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాలపై చాలా గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. పవన్ కళ్యాణ్-చంద్రబాబు-మోదీ కూటమిగా ఏర్పడటం సంతోషం. ఇది చాలా మంచి పరిణామం.

Padma Vibhushan for Megastar Chiranjeevi

అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సీఎం రమేష్, పెందుర్తి నుంచి JSP MLA అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ లను గెలిపించాలి. ఇద్దరు చాలా సమర్థవంతులు. మంచివారు. ఏపీ అభివృద్ధిలో ముందుకెళ్లాలి. అందుకోసం ప్రజలంతా నడుం బిగించాలి’ అని చిరంజీవి కోరారు.

అయితే.. మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రకటన వైసీపీ మండిపడుతోంది. అటు అహర్నిశం ప్రజల మధ్య ఉంటూ, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే నారా చంద్రబాబునాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశారు చిరంజీవి. వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news