బీజేపీ అంటే భారతీయ జూట పార్టీ, టీఆర్ఎస్ అంటే ప్రకృతి లాంటి పార్టీ – హరీష్ రావు

బీజేపీ అంటే భారతీయ జూట పార్టీ, టీఆర్ఎస్ అంటే ప్రకృతి లాంటి పార్టీ అని మంత్రి హరీష్ రావు అని పేర్కొన్నారు. మహబూబాబాద్ ను చూస్తే మానుకోట రాళ్ళు గుర్తుకువస్తున్నాయి… తెలంగాణ రాష్టం ఏర్పడకపోతే మహబూబాబాద్ జిల్లా ఏర్పడక పోవని.. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం హాస్పిటల్ ను అప్ గ్రేడ్ చేయడం కోసమే ప్రభుత్వం కృషి చేస్తుందని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 వేలకు పైగా మెడికల్ సీట్లను అందుబాటులో తేవడానికి ప్రభుత్వం మెడికల్ కళాశాల నిర్మాణాన్ని చేపడుతుందని…మెడికల్ కళశాల ల నిర్మాణం వలన పేద గిరిజనులకు మెరుగైన వైద్యం అండడమే కాకుండా ,పేదలకు వైద్య విద్య అందుబాటులో వస్తుందని అగ్రహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాళేశ్వరం ప్రాజెక్టు తో ఒక్క ఎకరం కూడా పారలేదు అంటున్నాడు.ఒక్కసారి వచ్చి చూస్తే బాగుంటుందని తెలిపారు.

జాతీయ పార్టీలు తెలంగాణా కు నష్టం చేస్తున్నాయని.. టీఆర్ఎస్ పార్టీ ప్రకృతి లాంటి పార్టీ. తెలంగాణ ఇంటి పార్టీ అని పేర్కొన్నారు.కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు అబద్దాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తున్నాయి ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి… బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామని బీజేపీ మోసం చేస్తుందన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడితేనే బీజేపీ పార్టీ 25 వేల కోట్లు ఇస్తామని బ్లాక్ మెయిల్ చేస్తుందని విమర్శించారు.