సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు మరో సవాల్ విసిరారు. రేపు పొద్దున 10 గంటలకు గన్ పార్క్ దగ్గర వస్తానని.. ఆగస్ట్ 15 లోగా రుణమాఫీ చేసేది నిజమైతే..ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మనమిద్దరం మన రాజీనామా లేఖలకు మేధావులకు ఇద్దామన్నారు హరీష్ రావు. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తే నేను నా రాజీనామా లేఖని స్పీకర్ కి ఇస్తారని సవాల్ చేశారు.
నువ్వు చెయ్యకపోతే నీ రాజీనామా లేఖని గవర్నర్ కి ఇస్తారని వెల్లడించారు. రేవంత్ రెడ్డి నువ్వు సిద్ధమా..నీకు దమ్ముంటే రా..? కొడంగల్ లో తోక ముడిచినట్టే తోక ముడుస్తావా అంటూ ఎద్దేవా చేశారు హరీష్ రావు. సిద్దిపేట లో బీజేపీ బహిరంగ సభపై హరీష్ రావు సెటైర్లు వేశారు. మెదక్ లో BRS మీటింగ్ మంటుటెండలో పెడితే సిద్దిపేట లో బీజేపీ టెంట్ ల కింద పెట్టిందని సెటైర్లు పేల్చారు హరీష్ రావు. కూలర్లు, వాటర్ బాటిళ్లు ఇచ్చి మీటింగ్ పెడితే మీరు మాత్రం ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చారని హరీష్ రావు కామెంట్స్ చేశారు.