తెలంగాణలో ఉద్రిక్తత..హరీష్ రావు, కౌశిక్‌ రెడ్డి హౌస్ అరెస్టు

-

Big Breaking: మాజీ మంత్రి హరీష్ రావు హౌజ్‌ అరెస్టు అయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. కోకపేట లోని హరీష్ రావు ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు పోలీసులు..అనంతరం హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. ఇంటి ముందు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి చేశారు పోలీసులు.
హరీష్ రావును కలిసేందుకు వచ్చే ప్రజలను అడ్డుకుంటున్నారు పోలీసులు.

Harish Rao, Kaushik Reddy house arrested

అటు కౌశిక్ రెడ్డిని కూడా హౌజ్ అరెస్ట్ చేశారట. మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు…వెస్ట్ మారేడ్ పల్లిలోని ఆయన నివాసానికి సెక్యూరిటీ పెంచారు.  శేరి లింగంపల్లిలో అరికేపూడి గాంధీ ఇంటి వద్ద బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు నివాసం దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. అటు పలుచోట్ల BRS నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news