బుచ్చమ్మ ఆత్మహత్య.. ఇది రేవంత్ రెడ్డి చేసిన హత్య అంటూ హరీష్ రావు సీరియస్ అయ్యారు. బుచ్చమ్మ పాపం ముగ్గురు బిడ్డలకు ఇల్లు కట్టించి.. పెళ్లిళ్లు చేసింది, ఆ ఇల్లు కూల కొడితే నా బిడ్డల భవిష్యతు ఏం అవుతుందని బాధతో ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు ఉదయం 9 గంటలకు హైడ్రా బాధితుల ఇంటికి పోతామని….మూసీ కూల్చివేతలపై హరీష్ రావు సంచలన ప్రకటన చేశారు. కేటీఆర్ కు జ్వరం రావడంతో… తెలంగాణ భవన్ లో హైడ్రా బాధితులతో మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డిలు సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా వారి గోడు చెప్తూ కన్నీరు పెట్టారు మూసి (హైడ్రా) భాదితులు. అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ… మూసీ రివర్ డెవలప్మెంట్ లో సిఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నాడని పేర్కొన్నారు. మూసీ పేరుతో పేదల ఇండ్లు కూలగొడుతున్న వ్యక్తీ రేవంత్ రెడ్డి అని… మూసీ పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. హైడ్రా భాదితులకు అండగా బిఆర్ఎస్ ఉంటుంది… న్యాయ పరంగా వారికి అండగా ఉంటామని ప్రకటించారు.