అక్టోబర్ మొదటి వారంలో కొత్త రేషన్, హెల్త్ కార్డులకు దరఖాస్తులు

-

రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డు నిత్యావసర సరకులకు, హెల్త్ కార్డు ఆరోగ్యానికి ఉపయోగపడేలా విడివిడిగా అందజేయబోతున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి తెలిపారు. రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తుండగా.. వారికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. గ్రామాల్లో సభలు నిర్వహించి ప్రజల నుంచి ఆర్జీలు తీసుకుంటామన్నారు. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పలువురు రేషన్ కార్డుల అర్జీలు సమర్పించేందుకు రావడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు.

అక్టోబర్ తొలి వారంలో రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు వెల్లడించారు. రేషన్ కార్డులతో పాటు ప్రజల ఆరోగ్యం కోసం హెల్త్ కార్డులను కూడా ఇస్తామని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీపై విధి విధానాలు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, నిబంధనలు, ఏ విధంగా సాఫీగా ముందుకు వెళ్లాలన్న అంశాలపై తాము చర్చించినట్టు మంత్రి ఉత్తమ్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news