harish rao on krishank arrest: క్రిషాంక్ అరెస్టు అప్రజాస్వామికం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నాడనే కక్షతో బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ పై అక్రమ కేసులు బనాయించి వేదింపులకు గురిచేస్తున్నది.
అయితే.. నిన్న క్రిషాంక్ ను అరెస్ట్ చేయడంపై హరీష్ రావు స్పందించారు. బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ అరెస్టు అప్రజాస్వామికం అన్నారు. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న ఈ కక్ష సాధింపులకు మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్ ఇచ్చారు హరీష్ రావు.