పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలయ్యే వరకు మేం నిద్రపోం : హరీశ్ రావు

-

బీఆర్ఎస్ను వీడి వెళ్తున్న ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేవరకు తాము నిద్రపోమని అన్నారు. సుప్రీంకోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పోరాడుతామని తెలిపారు. ఆ నాయకుల నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉప ఎన్నిక వస్తుందని జోస్యం చెప్పారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు.

‘2001లో తెలంగాణ ఉద్యమం పిడికెడు మందితో ప్రారంభమైంది. కేసీఆర్ ఒక్కడే 14 ఏళ్లు పోరాడి రాదని అనుకున్న తెలంగాణని తెచ్చి చూపించారు. మహిపాల్ రెడ్డిని మూడు సార్లు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని చేసింది. ఏం తక్కువ చేసిందని మహిపాల్ రెడ్డి పార్టీ మారారు..?ఆయనకి మనసు ఎలా వచ్చింది? తల్లిలా పార్టీ మహిపాల్ రెడ్డిని దగ్గర చేసింది పార్టీ. గూడెం పోయినా కార్యకర్తలు గుండె ధైర్యం కోల్పోవద్దు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని అన్నారు ఇప్పుడు ఆయనే కండువా కప్పుతున్నారు. రేవంత్ రెడ్డి రుణమాఫీలో కోతలు పెడుతున్నారు.’ అంటూ హరీశ్ రావు ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news