రేవంత్ రెడ్డి…. మహారాష్ట్రకి వెళ్లి అబద్దాలు ఆడుతున్నాడని ఆగ్రహించారు మాజీ మంత్రి హరీష్ రావు. వరి పంటకు బోనస్ రూ. 500 ఇస్తున్న అన్నాడు.. ఎక్కడ ఇస్తున్నాడని నిలదీశారు. రైతులకు ఇచ్చిన హామీలు సంపూర్ణంగా ఒక్కటి కూడా అమలు చేయలేదు.. మహారాష్ట్రకు వెళ్లి రేవంత్ రెడ్డి హామీలు చేశామని అబద్ధాలు అంటున్నాడని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు.
రేవంత్ రెడ్డి తన అబద్ధాల ప్రవాహాన్ని మహారాష్ట్ర లో కొనసాగించారు… ఆరు గ్యారంటీ లు ఇచ్చి అమలు చేయకుండా తెలంగాణ లో మోసం చేశారని ఫైర్ అయ్యారు. రుణమాఫీ చేస్తాం అని చెప్పి మాట తప్పినం అని మహారాష్ట్ర లో చెప్పాల్సి ఉండే…. మహారాష్ట్ర కు వెళ్లి అన్ని గ్లోబల్స్ ప్రచారం చేశారని ఆగ్రహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్సైట్ లో అబద్ధాలు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణ లో అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి మోసం చేశారన్నారు.