సీఎం రేవంత్‌ నియోజకవర్గంలో పాఠశాల మూతపడటం సిగ్గుచేటు – హరీష్‌ రావు

-

తెలంగాణ స్కూల్స్‌ మూసివేతపై మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ లో ఉపాధ్యాయులు లేక పాఠశాల మూతపడటం సిగ్గుచేటు అంటూ ఆగ్రహించారు మాజీ మంత్రి హరీష్ రావు. 15 రోజులుగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పి, ఇప్పుడు ఉన్న ప్రభుత్వ స్కూళ్లను మూతపడేలా చేస్తున్నారు. పేద పిల్లలకు ప్రాథమిక విద్యను దూరం చేస్తున్నారని తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు.

Harish Rao on a tour of temples

తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు మూతపడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? అని ఆగ్రహించారు. విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి వద్దే ఉన్నప్పటికీ విద్య పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు? అని నిలదీశారు మాజీ మంత్రి హరీష్ రావు. తక్షణమే పాఠశాలల్లో విద్యా వాలంటీర్లు నియమించి పాఠశాలను మూతపడకుండా చూడాలని, మూతపడ్డ పాఠశాలలను తెరిపించి విద్యా బోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news