దేశంలో అత్యంత తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రం తెలంగాణ : హరీశ్ రావు

-

కేంద్ర ప్రభుత్వం పదేళ్లలో 100 లక్షల కోట్ల అప్పులు చేసిందని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ జీఎస్‌డీపీలో అప్పుల శాతం 28 శాతం అని.. దేశ జీడీపీలో కేంద్రం చేసిన అప్పుల 57 శాతం అని తెలిపారు. దేశంలో అత్యంత తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దేశంలో తెలంగాణ ఉద్యోగులు అత్యధిక వేతనాలు అందుకుంటున్నారని వెల్లడించారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరగడానికి కారణం బీజేపీ కాదా? అని ప్రశ్నించారు. పాల ప్యాకెట్లపై కూడా బీజేపీ జీఎస్టీ విధించిందని మండిపడ్డారు. బీజేపీ పాలనలో రూపాయి విలువ పడిపోయిందని పేర్కొన్నారు.

“మోదీ సర్కార్‌ కార్పొరేట్ల రుణాలు మాఫీ చేసింది.. రైతులను మాత్రం పట్టించుకోలేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ హామీ ఏమైంది. 8 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని కేంద్రమే చెప్పింది. తెలంగాణకు చట్టబద్ధంగా రావాల్సి ఉన్న లక్ష కోట్ల నిధులను కేంద్రం ఇవ్వలేదు. తెలంగాణ ఏర్పడే నాటికి జీతాలు, పింఛన్ల వ్యయం రూ.18 వేల కోట్లు ఉండేది. ప్రస్తుతం జీతాలు, పింఛన్ల వ్యయం రూ.60 వేల కోట్లు ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీఆర్ఎస్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఓపీఎస్‌పై కమిటీ వేసి.. సమస్యను పరిష్కరిస్తాం.” అని హరీశ్ రావు హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news