పాలేరులో పొంగులేటికి ఉపేందర్ రెడ్డి పోటీ ఇవ్వగలరా?

-

తెలంగాణలో ఈ ఎన్నికలను బిఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈసారి కచ్చితంగా గెలిచి బిఆర్ఎస్ కు చెక్ పెట్టాలని వ్యూహరచనలో ఉన్నారు. రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలు ఇరు పార్టీలకు ప్రత్యేకమే. అటువంటి నియోజకవర్గాలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం ఒకటి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జనరల్ సీట్లలో ఒకటి, ముఖ్యమైనది పాలేరు నియోజకవర్గం.

పాలేరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ నుండి కందాల ఉపేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఉపేందర్ రెడ్డికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బరిలోకి దించింది. బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు నియోజకవర్గం ఏరి కోరి మరీ తీసుకొని విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా పాలేరులో సభ పెట్టాడు అంటే పాలేరు నియోజకవర్గం బిఆర్ఎస్ కు ఎంత ప్రత్యేకమో, ఎంత ముఖ్యమో వేరే చెప్పనవసరం లేదు కదా.

బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన పొంగులేటి పై కేసీఆర్ కు ఆగ్రహం ఉంది. పొంగులేటిని ఖచ్చితం గా ఓడించాలని కేసీఆర్ భావిస్తున్నారు. నామినేషన్ వేయటానికి కూడా వీలు లేకుండా పొంగులేటి ఇంటిపై, అనుచరులపై ఐటీ దాడులు జరిగాయి అంటే పాలేరులో పొంగులేటి గెలుపు ఖాయమైనట్టే అని సామాన్యునికి సైతం అర్థమవుతుంది. పాలేరు కాంగ్రెస్ అడ్డా. వైయస్ అభిమానులు గాని, కాంగ్రెస్ ను అభిమానించేవారు గానీ ఈ నియోజకవర్గంలో ఎక్కువమంది ఉన్నారు. అందుకే ఈ నియోజకవర్గాన్ని అందరూ ప్రత్యేకంగా తీసుకున్నారని చెప్పవచ్చు. బిఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత కూడా ఈసారి పాలేరులో పొంగులేటి విజయానికి మెట్టుగా మారవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్రం మొత్తం పాలేరు వైపు చూస్తుంటే పాలేరు ప్రజలు ఏ పార్టీ వైపు చూస్తారో అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు…

Read more RELATED
Recommended to you

Latest news