పార్టీలకు గేట్లు ఎత్తుడు కాదు..ముందు ప్రాజెక్టుల గేట్లు ఎత్తు – హరీష్‌ రావు

-

పార్టీలకు గేట్లు ఎత్తుడు కాదు..ముందు ప్రాజెక్టుల గేట్లు ఎత్తు అంటూ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు హరీష్‌ రావు. పార్టీలకు గేట్లు ఎత్తుడు కాదు..ముందు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి ఎండిపోతున్న పంట పొలాలను కాపాడే ప్రయత్నం చేయండి రేవంత్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు. కేసీఆర్ పాలనలో పచ్చని పంట పొలాలు అయితే…కాంగ్రెస్ పాలనలో పంటలకు మంటలు అంటూ ఆగ్రహించారు.

harish rao

కాంగ్రెస్‌ సర్కార్‌ 100 రోజుల పాలనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు మాట్లాడుతూ….కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 174 మంది రైతులు, 38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు అని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ లను 100 రోజుల్లో అమలు చేస్తాం అని ఎన్నికల ముందు చెప్పారు.ప్రమాణ స్వీకారం రెండు రోజుల ముందే చేశారు. కానీ హామీల అమలు ను జాప్యం చేస్తున్నారు. రైతు బంధు ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. రైతు భరోసా గురించి అసలు మాట్లాడట్లేదు. రాష్ట్రంలో తాగునీరు కొరత ఏర్పడింది. ఈ వంద రోజుల్లో 174 మంది రైతులు, 38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version