డియర్‌ అచ్చూ కంగ్రాట్స్‌.. పుత్రోత్సాహంలో మంత్రి హరీశ్‌రావు

-

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రస్తుతం పుత్రోత్సాహంలో ఉన్నారు. తన కుమారుడి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. హరీశ్ రావు తనయుడు ఆర్చిష్మాన్‌.. బౌల్డర్‌లోని కొలరాడో విశ్వవిద్యాలయం నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌లో పట్టా అందుకున్నారు. తన కుమారుడి విజయాన్ని ఆనందిస్తూ  ఫొటోలు, వీడియోను హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు.

సివిల్‌ ఇంజినీరింగ్‌లో పట్టా అందుకోవడంతో పాటు, గ్లోబల్‌ ఎంగేజ్‌మెంట్‌ అవార్డు రావడం ఆనందంగా ఉందని హరీశ్ రావు అన్నారు. దీనికి గర్వపడటం లేదన్న హరీశ్‌రావు.. ఈ విజయం ఆర్చిష్మాన్‌ పట్టుదల, అభిరుచికి నిదర్శనమని ట్వీట్ చేశారు. ఈ నైపుణ్యంతో ఆర్చిష్మాన్‌ ప్రపంచంలో సానుకూల ప్రభావాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడని భావిస్తున్నట్టు చెప్పారు. ప్రియమైన అచ్చు అంటూ అభినందనలు తెలిపారు. ఇది అపురూపమైన మైలురాయి అని అభివర్ణించారు.

‘నా కుమారుడు, గ్లోబల్‌ ఎంగేజ్‌మెంట్‌ అవార్డు గ్రహీత అని ప్రకటించడానికి గర్వపడుతున్నాను. నా కుమారుని అద్భుతమైన విజయానికి కాదు గానీ.. అతని పట్టుదలకు, వైవిధ్య భరిత విజయాన్ని సొంతం చేసుకోవాలనే అతని అభిరుచికి గర్వపడుతున్నాను. తన నైపుణ్యంతో, అర్చిశ్మన్‌ ప్రపంచంలో ఆశావహ ప్రభావాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడుతున్నాను’ అంటూ హరీశ్‌రావు తన కుమారుడి గ్రాడ్యుయేషన్‌ డే ఫొటోలను ట్వీట్‌ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news