తెలంగాణ రాష్ట్రంలో మార్చి తర్వాత ఉచితంగా విద్యా, వైద్యం అందిచాలని ముఖ్య మంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటి నుంచో కల కంటున్నారని అన్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా విద్య, వైద్యం అందరికీ ఉచితంగా అందిచాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని అన్నారు. దానికి సంబంధించిన సాధ్యా సాధ్యాలను పరిశీలిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దళితులు అందరికీ దళిత బంధు పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అందు కోసం రూ. 20 వేల కోట్లను విడుదల చేయనున్నారని అన్నారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి దళిత బంధు పథకం వర్తింప చేస్తామని ప్రకటించారు. అర్హులకు ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలలో రూ. 10 లక్షలు జమా అవుతాయని అన్నారు. దళిత బంధు పథకం అమలు ప్రక్రియ వేగంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని అన్నారు.