మ‌రో నాలుగు రోజులు వ‌ర్షాలే..!

తెలంగాణ వ్యాప్తంగా సోమవారం రాత్రి భారీ వ‌ర్షం కురిసింది. ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏర్ప‌డిన అల్పపీడనం మరింత బలపడడంతో భారీ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. అయితే.. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ‌లో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

rains-in-telanga
rains-in-telanga

ఆదిలాబాద్‌, కుమ్రంభీం, సిద్దిపేట, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నిర్మల్‌, జగిత్యాల, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జనగాం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది.