బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమై వారం రోజులైనా గత సీజన్లలా కాకుండా మొదటి వారం రోజులు షో చప్పగా సాగింది. వీక్ డేస్ లో బిగ్ బాస్ షో మెప్పించలేక పోవడంతో కనీసం వీకెండ్ లో నాగార్జున ఎంట్రీతో సీన్ మారుతుందని భావించినా ఆ ఎపిసోడ్ పరమ బోరింగ్ గా సాగింది. అయితే ఆదివారం ఎపిసోడ్ తో నాగ్ తనలో జోష్ ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. తొలి వారం బిగ్ బాస్ హౌస్ నుండి సూర్యకిరణ్ ఎలిమినేట్ కాగా ఈరోజుల్లో, బస్ స్టాప్ ఫేమ్ సాయి కుమార్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు.
సోమవారం ఎపిసోడ్ విషయానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సాయి ఇంట్లోకి దొంగలా ప్రవేశించి ఇంటి సభ్యులతో మాట్లాడి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడని పసిగట్టేలా చేశాడు. అయితే తొలి వారం కన్నీళ్లతో పాపులర్ అయిన మోనాల్ నటుడు అభిజిత్ తో ప్రేమాయణం సాగించి పాపులర్ అవుతోంది. అభిజిత్, మోనాల్ అర్ధరాత్రి, ఉదయం కూడా రహస్యంగా మాట్లాడుకోవడం ఈ అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు అఖిల్ మోనాల్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది.
మంచిగా మాట్లాడు అంటూ మోనాల్ అఖిల్ పై ఫైర్ అయింది. బిగ్ బాస్ ఒక రేషన్ మేనేజర్ ను ఎంచుకుని ఇంటి సభ్యులకు కావాల్సిన రేషన్ పొందాలని సూచించగా ఇంటి సభ్యులు అందుకు అంగీకరించారు. కెప్టెన్ లాస్య అమ్మ రాజశేఖర్ ను రేషన్ మేనేజర్ గా ఎంపిక చేయగా వాళ్లు స్టోర్ రూమ్ కు వెళ్లి అవసరమైన వస్తువులను తెచ్చుకున్నారు. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో 16 మంది గార్డెన్ ఏరియాలో ఉన్న పడవలోకి ఎక్కాలని… పడవ ప్రతి తీరం మధ్య ఆగినప్పుడు ఒక్కో సభ్యుడు దాని నుంచి దిగిపోవాలని.. అలా మొత్తం తొమ్మిది మంది దిగిపోవాలని బిగ్ బాస్ సూచించాడు.
ఇంటి సభ్యుల్లో తొలి హారన్ కు గంగవ్వ, రెండో హారన్ కు నోయల్, మూడో హారన్‌కు మోనాల్, నాలుగో హారన్ కు సోహైల్, ఐదో హారన్ కు కరాటే కళ్యాణి ఆ తరువాత హారన్ లకు అమ్మ రాజశేఖర్, సాయి కుమార్, హారిక, అభిజిత్ పడవ నుండి దిగిపోయారు. మెహబూబ్, దివి, అఖిల్, సుజాత మాత్రం ఎలిమినేట్ అవుతామన్న భయంతో పడవ నుండి దిగలేదు. ఇక ఈ వారం సేఫ్ ఎవరు అవుతారో ఎలిమినేట్ ఎవరు అవుతారో చూడాల్సి ఉంది. అయితే సరైన కారణం చెబితే తాను దిగిపోతానంటూ సాయికుమార్ మొదట సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడం గమనార్హం.