గుజరాత్ ను ముంచెత్తున్న భారీ వర్షాలు

-

గుజరాత్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు నర్మదానది ఉప్పొంగుతుంది. దీంతో స్టాట్యూ ఆఫ్ యూనిటీని తాకుతూ ప్రవహిస్తుంది నర్మద నది. ఉధృతంగా ప్రమాదాన్ని మించి ప్రవహిస్తుంది. భారీ వర్షానికి బరూచ్ పట్టణం నీట మునిగిపోయింది. ఖేడా డ్యామ్ నీటిని వదలడంతో ఇండ్లలోకి నీరు చేరడంతో నిత్యవసర వస్తువులు తడిసి పోయి జనాలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా బరూచ్ నగరం మొత్తం జలమయమైంది. ఈ ప్రాంతంలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కేవలం గుజరాత్ రాష్ట్రంలోనే కాదు. ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో వర్షం బీభత్సమే సృష్టిస్తోంది.

భారీ వర్షాల కారణంగా ఉత్తర భారతదేశంలో పలు నగరాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా రాజస్థాన్ లో శనిదేవుడి ఆలయం, మధ్యప్రదేశ్ లో ఉజ్జయిని ఆలయం నీట మునిగిపోయింది. అక్కడక్కడ డ్యామ్ ల నుంచి నీటిని కిందికి వదులుతున్నారు. భారీగా వరద నీరు చేరడంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురవడంతో ఆయా ప్రాంతాలు అతలకుతలమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news