BREAKING : హైదరాబాదులో మరో 5 గంటలు భారీ వర్షాలు

-

హైదరాబాద్‌ లో మరో నాలుగు నుంచి ఐదు గంటలు భారీ వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటన చేసింది. అంతేకాదు… ఈ ఐదు గంటల పాటు.. హైదరాబాద్‌ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటన చేసింది. హైదరాబాద్ వెస్ట్, నార్త్, సెంట్రల్ జోన్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ కూడా వర్షాలు కొనసాగనున్నాయి. TSలోని మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అవసరమైతేనే బయటకు రావాలని, జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది. ఏపీలోని మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు పడతాయంది.

Read more RELATED
Recommended to you

Latest news