ఇటీవలే ఖుషి సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సమంత.. మరికొద్ది రోజుల్లో చికిత్స కోసం అమెరికాకు వెళ్లనుంది. అయితే యూఎస్‌కు వెళ్లే ముందు సామ్ ఆధ్యాత్మిక పర్యటన చేస్తోంది. ఇందులో భాగంగానే దేశంలోని పలు ప్రముఖ ఆలయాలను సందర్శిస్తోంది. తాజాగా సమంత కోయంబత్తూరులోని ఈషా షౌండేషన్‌కు వెళ్లింది. ఆ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆధర్యంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ధ్యానం చేసింది. ఈ ఫొటోలు కాస్త ఇప్పుడు నెట్టింట షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.
‘‘ఇప్పటి వరకు.. ఎలాంటి ఆలోచనలు రాకుండా, ఎటూ కదలకుండా కూర్చోవడం అసాధ్యమనిపించింది. కానీ, ధ్యానమనేది ప్రశాంతత, శక్తి, స్పష్టతకు అత్యంత శక్తిమంతమైన మార్గం అని ఈరోజు అర్థమైంది. ఈ ప్రక్రియ సింపుల్‌గా ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఊహించలేదు’’ అని సమంత ఆ ఫొటోలకు క్యాప్షన్ జోడించింది. సమంత షేర్ చేసిన ఫొటోల్లో ఆమె అందరితో కలిసి కూర్చొని, సింపుల్‌గా కనిపించడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.