హైదరాబాద్​ వాసులకు మరో 10 రోజులు ట్రా‘ఫిక్ సమస్య

-

హైదరాబాద్​లో మూడ్రోజులుగా ట్రాఫిక్ సమస్యతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు.. మరోవైపు నుమాయిష్.. ఇంకా ఈనెల 11న ఫార్ములా ఈ-రేసింగ్.. 17న నూతన సచివాలయం ప్రారంభం.. 18న శివరాత్రి వేడుకలు జరగనున్నందున ఈ ట్రాఫిక్ సమస్య మరో పదిరోజులు నగరవాసులను ఇబ్బంది పెట్టక తప్పదు. పోలీసులు నిరంతరం విధులు నిర్వహిస్తున్నా ట్రాఫిక్ సమస్య తప్పడం లేదు.

గ్రేటర్‌లో 80 లక్షలకుపైగా వాహనాలున్నాయి. వీటిలో 30-40 లక్షలు రాకపోకలు సాగిస్తుంటాయని అంచనా. ఉదయం, సాయంత్రం రద్దీ కారణంగా 10-12 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు 30-40 నిమిషాలు వెచ్చించాల్సి వస్తోంది. కొద్దిరోజులుగా కిలోమీటరు దూరానికే 50-60 నిమిషాలు పడుతోందంటూ వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news