మేడారం భక్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మేడారం జాతర వెళ్లే భక్తులకు హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తాజాగా ప్రకటన చేసింది. ఈనెల 13వ తేదీ నుంచి జాతర అయిపోయే వరకు ఈ హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి ఉంచుతామని ప్రకటించింది.
బెంగళూరుకు చెందిన 90 ఏవియేషన్ సంస్థ హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ నుంచి మేడారం జాతరకు భక్తులు తరలించేందుకు హెలిప్యాడ్ సిద్ధం చేసింది. ఇందుకోసం ఒక్కొక్కరికీ 20,000 రూపాయలు చార్జీ గా నిర్ణయించారు.
మేడారం జాతర లో తీసుకోవాల్సిన చర్యలు అలాగే ఏర్పాట్లపై డిజిపి దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది జాతరకు కోటి మందికిపైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. జాతరకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు రావద్దని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.కరోనా మహమ్మారి నేపథ్యంలో 35 హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ దర్శనాలు జరగాలని పేర్కొన్నారు అధికారులు.