ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసే యోచనలో బిజెపి అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయన సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్ ని పార్టీ ఆదేశించింది. ఈ క్రమంలో రాజాసింగ్ భార్య ఉషా భాయ్ నేడు రాష్ట్ర బిజెపి కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని కలిసింది.
సస్పెన్షన్ ఎత్తివేస్తేనే జైల్లో ఆయనకు పార్టీ పరంగా సాయం లభించే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. అయితే మునుగోడు ఉప ఎన్నికలకు ముందే సస్పెన్షన్ ఎత్తివేస్తారని వార్తలు వచ్చినప్పటికీ అలా జరగలేదు. అయితే రాజా సింగ్ ఇచ్చిన వివరణపై బీజేపీ హై కమాండ్ సంతృప్తిగా ఉన్నట్లుు తెలుస్తోంది. ఆయనకు అన్ని విధాలుగా మద్దతు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.