High Court is serious about Ranganath: హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. చార్మినార్‌ను కూల్చాలని చెబితే మీరు కోల్చేస్తారా? రంగనాథ్ పై హై కోర్టు సీరియస్ కావడం జరిగింది. హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. శని, ఆదివారాల్లో సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు ఎందుకని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ధర్మాసనం ప్రశ్నించింది.
సెలవుల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి, అత్యవసరంగా కూల్చివేస్తున్నారని నిలదీసింది. చార్మినార్‌ను కూల్చేయాలని అక్కడి ఎమ్మార్వో చెప్తే కూల్చేస్తారా అని ఫైర్ అయ్యింది. హైడ్రా పనులకు హైకోర్టు సంతోషంగా లేదని తెలిపింది. మరోసారి హైడ్రా చట్టభద్దత తెలపాలని కమీషనర్ ను కోరిన హైకోర్టు….మీ పొలిటికల్ బాసుల కోసం మీరు ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదని ఆగ్రహించింది. అసలు చట్టం చెప్పేది ఏంటి.. మీరు చేస్తుంది ఏంటి.. అంటూ తెలంగాణ హై కోర్టు సీరియస్ అయింది.