తమిళనాడులొ బీజేపీ వర్సెస్ డీఎంకే.. ఎవరివి ఫ్యామిలీ పాలిటిక్స్?

-

తమిళనాడు రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. సీఎం స్టాలిన్ తన కొడుకు ఉదయనిధి స్టాలిన్‌ను డిప్యూటీ సీఎంను చేయడంతో ప్రస్తుత రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.స్టాలిన్ ఫ్యామిలీ పాలిటిక్స్‌కు పెద్ద పీట వేస్తున్నారని బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తున్నది. అయితే, ఇదంతా స్టాలిన్ ముందస్తు వ్యుహంలో భాగంగానే చేసినట్లు చేసినట్లు డీఎంకే వర్గాలు చెబుతున్నాయి.తమిళ సూపర్ స్టార్ విజయ్ తలపతి పొలిటికల్‌ ఎంట్రీకి రంగం సిద్ధం కావడంతో తమిళ పాలిటిక్స్‌లో ఒక్కసారిగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

అయితే, ప్రస్తుతం బీజేపీ, డీఎంకే పార్టీల మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం కొనసాగుతోంది. కరుణానిధి సీఎంగా పనిచేశారని, ఇప్పుడు ఆయన కొడుకు స్టాలిన్ సీఎంగా ఉన్నారని, తాజాగా ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం అయ్యారని బీజేపీ ఆరోపిస్తున్నది. ఉదయనిధి స్టాలిన్ తర్వాత ఆయన కుమారుడు ఇన్బనితి డీఎంకే పార్టీ తరుఫున భవిష్యత్ సీఎం అవుతారని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. అయితే, కేంద్రమంత్రి అమిత్ షా కుమారుడు జై షా ఏ అర్హతతో బీసీసీఐ సెక్రటరీ అయ్యాడని డీఎంకే శ్రేణులు బీజేపీపైకి ఎదురుదాడికి దిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news