BREAKING: అలంపూర్ BRS ఎమ్మెల్యే విజయుడికి హైకోర్టు నోటీసులు

-

BREAKING: అలంపూర్ BRS ఎమ్మెల్యే విజయుడికి బిగ్‌ షాక్‌ తగిలింది. గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడికి తెలంగాణ రాష్ట్ర హై కోర్టు నోటీసులు జారీ చేసింది.
విజయుడి ఎన్నికను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీఎస్పీ అభ్యర్ది ప్రసన్నకుమార్.

High Court notices to Alampur BRS MLA Vijayudu

ఫీల్డ్ అసిస్టెంట్ పదవికి రాజీనామా చేయకుండానే నామినేషన్ వేయడంతో పాటు, వృత్తి వివరాలు నామినేషన్ లో పేర్కొనలేదని పిటీషన్ వేశారు బీఎస్పీ అభ్యర్ది ప్రసన్నకుమార్. ఈ ఎన్నికపై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే విజయుడికి నోటీసులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర హై కోర్టు. కాగా మొన్నటి ఎన్నికల్లో అలంపూర్ ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున గెలిచారు విజేయుడు.

Read more RELATED
Recommended to you

Latest news