బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం ఎన్నికను రద్దు చేయాలని ప్రత్యర్థి విజయా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో దానం నాగేందర్ ఓటర్లను ప్రలోభ పెట్టారని, ఓటర్లకు డబ్బులు పంచడంతో పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదు అయ్యాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేగాక ఆయన సతీమణి ఆస్తుల వివరాలు అఫిడవిట్‌లో పేర్కొనలేదని చెప్పారు.
ఈ మేరకు ఇవాళ ఈ పిటిషన్‌పై విచారణ జరగ్గా.. దీనిపై వివరణ ఇవ్వాలని దానం నాగేందర్‌కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి విజయారెడ్డి పోటీ చేయగా.. 22,010 ఓట్ల మెజార్టీతో దానం విజయం సాధించారు. అయితే దానం నాగేందర్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టి అక్రమంగా గెలిచారని ఆయన ఎన్నికను రద్దు చేయాలని ఆమె హైకోర్టును ఆశ్రయించగా.. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.