తెలంగాణ హైకోర్టులో హరీష్ రావుకు ఊరట లభించింది. పంజాగుట్టలో నమోదైన కేసులో హరీష్ రావును అరెస్టు చేయొద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ వాయిదా వేసింది హై కోర్టు. హరీష్ రావును అరెస్ట్ చేసిన వెంటనే.. హై కోర్టును ఆశ్రయించింది బీఆర్‌ఎస్ పార్టీ. ఈ తరుణంలోనే… పంజాగుట్టలో నమోదైన కేసులో హరీష్ రావును అరెస్టు చేయొద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఇక మాజీ మంత్రులు, మా నాయకులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి గార్లతోపాటు మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్ట్‌లు అప్రజాస్వామికం.. వారిని తక్షణమే విడుదల చెయ్యాలంటూ డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు.. పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు అంటూ ఆగ్రహించారు. పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు.. గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.