తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండిస్తున్న వరి ధాన్యాన్ని వందకు వంద శాతం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు చేస్తుంది. ఈ ఆందోళనలో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తం పలు రహదారులను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దిగ్బంధం చేశారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఈ రాస్తారోకోలపై హై కోర్టు లో పిటిషన్ దాఖలు అయింది. ప్రజా రవణాకు టీఆర్ఎస్ పార్టీ ఆటంకం కలిగిస్తుందని పిటిషనర్.. హై కోర్టును ఆశ్రయించాడు. కాగ ఈ పిటిషన్ పై తెలంగాణ హై కోర్టు నేడు విచారణ జరిపింది.
టీఆర్ఎస్ పార్టీ చేసిన రాస్తారోకోలపై హై కోర్టు సీరియస్ అయింది. అనుమతి లేకుండా.. రాస్తారోకోలు చేస్తుంటే.. ఏం చేస్తున్నారని రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖను ప్రశ్నించింది. నేడు రాస్తారోకోలు నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో హై కోర్టుకు తెలపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.