తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హై కోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 402 ను హై కోర్టు సస్పెన్షన్ చేసింది. ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జీవో నంబర్ 402 తీసుకువచ్చింది. తాజా గా ఈ జీవో నెంబర్ 402.. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందని కొంత మంది ఉపాధ్యాయులు గతంలో హై కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లను హై కోర్టు న్యాయమూర్తి జస్టీస్ విజయసేన్ రెడ్డి ఆధ్వర్యంలోని ధర్మసనం విచారించింది. ఈ జీవో నెంబర్ 402 ద్వారా ఉపాధ్యాయులు సీనియారిటీ కోల్పోవాల్సి వస్తుందని ఉపాధ్యాయుల తరపున న్యాయవాది వాదనలు వినించారు. దీంతో హై కోర్టు.. జీవో నెంబర్ 402 ను సస్పెన్షన్ చేసింది. అలాగే ఈ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే ఈ కేసులో తదుపరి విచారణను జూన్ 20కి వాయిదా వేశారు.