రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్ సమతా మూర్తి ఆశ్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారు. అనంతరం అక్కడ మాట్లాడారు. హిందూ మతం మాత్రమే కాదని జీవన విధానం అని అన్నారు. అలాంటి సంస్కృతి మన దగ్గర మాత్రమే ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే తనకు అరుదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాట్లాడాలంటే భయంగా ఉంటుందని అన్నారు. కాగ జీయర్ స్వామీ చెప్పిన మాటలు తన మనసును తాకాయని అన్నారు.
మన మతాన్ని ఆరాధించు.. ఎదుటి వారి మతాన్ని గౌరవించు అనే గొప్ప మాటలు చెప్పారని పవన్ కళ్యాణ్ అన్నారు. రామానుజ జీయర్ స్వామి గొప్ప విప్లవ నాయకుడని తెలిపారు. ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపారని అన్నారు. రామనుజు చార్యుల గొప్పతనం గురించి దేశ వ్యాప్తంగా కనిపించేలా.. వినిపించేలా విగ్రహం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. ముందు తరాలకు మనం ఇవ్వాల్సింది చరిత్ర మాత్రమే అని అన్నారు. అలాగే రామానుజు చార్యుల విగ్రహంతో పాటు 108 ఆలయాల నమూనాను నిర్మించడం చాలా గొప్ప నిర్ణయం అని అన్నారు.