Lata Mangeshkar: ల‌తా మంగేష్క‌ర్ అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రైన‌ ప్ర‌ధాని

-

భార‌త గాన కోకిల‌, భార‌తర‌త్న అవార్డు గ్ర‌హీత ఆదివారం ఉద‌యం క‌న్నుమూశారు. వివాదాల‌కు అతీతంగా, అభిమానుల‌కు స‌మీపంగా ఉండే మ‌హోన్న‌త వ్య‌క్తిత్వం ఆమెది. 30కి పైగా భార‌తీయ, విదేశీ భాష‌ల్లో వేల గీతాల‌ను ఆల‌పించారు. అత్య‌ధికంగా హిందీ, మరాఠీ భాష‌ల్లో ఆమె పాట‌లు పాడారు. ఇవాళ ఉద‌యం ఆమె మ‌ర‌ణించ‌డంతో ఉద‌యం ఆసుప‌త్రి నుంచి ఆమె నివాసానికి త‌ర‌లించి. నివాసం నుంచి సాయంత్రం అంతిమ యాత్ర నిర్వ‌హించారు. ఆ త‌రువాత ముంబైలోని శివాజీ పార్కులో అంత్య‌క్రియ‌లను ఏర్పాటు చేశారు.

ముఖ్యంగా ఈ అంత్య‌క్రియ‌ల వేడుక‌ల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలుగా ప్ర‌క‌టించ‌గా.. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్ర‌క‌టించింది. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ హాజ‌రై భౌతిక కాయానికి నివాళుల‌ర్పించారు. శివాజీ పార్కు అంత్య‌క్రియ‌ల వ‌ద్ద ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ ప్ర‌ముఖులు, అభిమానులతో ఆ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయింది. ప్ర‌భుత్వ లాంఛ‌నాల మ‌ధ్య అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. అమ‌ర్ ర‌హే అమ‌ర్ ర‌హే నినాదాలు మారు మ్రోగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news