ఇవాళ్టితో ముగియనున్న హెచ్‌ఎండీఏ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ

-

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్, రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. గత ఎనిమిది రోజులుగా జరుగుతున్న ఈ విచారణలో ఇప్పటికే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. బాలకృష్ణ తన కుటుంబ సభ్యులు, బంధువుల పేర్ల మీద భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించామని వెల్లడించారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆయనకు ఆస్తులు ఉన్నాయని తెలిపారు.

అయితే ఇవాళ్టితో శివ బాలకృష్ణ ఏసీబీ కస్టడీ గడువు ముగుస్తుంది. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉండటతో మరోసారి బాలకృష్ణను కస్టడీకి అనుమతించాలని ఏసీబీ అధికారులు కోర్టును కోరనున్నట్లు సమాచారం.. ఇప్పటికే ఈ కేసులో బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బాలకృష్ణకు నవీన్ బినామీగా ఉన్నట్లు అధికారులు దర్యాప్తులో గుర్తించారు. మరింత లోతుగా విచారిస్తే ఇంకొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని ఏసీబీ భావిస్తోంది. ఈ క్రమంలోనే కస్టడీ పొడిగింపుపై కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version