ఎమ్మెల్యేలు రాజాసింగ్, పల్లా, కడియంపై డీజీపీకి టీ కాంగ్రెస్ ఫిర్యాదు

-

కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోయేలా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలపై టీకాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. వచ్చే ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం అంటూ ఇటీవల వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లపై పీసీసీ జనరల్ సెక్రటరీ కైలాష్ నేత, టీకాంగ్రెస్ నేతలు చార చారుకొండ వెంకటేష్, మధుసూదన్ లు మంగళవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు.


కొత్త ప్రభుత్వం ఏర్పాటై 100 గంటలు గడవక ముందే ఇరు పార్టీల నేతలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యలు చేశారని, బీజేపీ గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందనే విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇటీవల రాజాసింగ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదు. ఒక్క ఏడాది మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం ఉంటుందని కామెంట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి అవస్థలు తప్పవని ఆ పార్టీకి భారీ మెజార్టీ లేకపోవడంతో త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news