తెలంగాణ రాష్ట్రం లో మద్యం దుకాణాలకు భారీ సంఖ్య లో దరఖాస్తులు వచ్చాయి. గురు వారం రోజు చివరి రోజు కావడం తో భారీగా దరఖాస్తు లు వచ్చాయి. గురు వారం చివరి రోజు కావడం తో రికార్డు స్థాయిలో 32,196 అప్లికేషన్స్ వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 34 ఎక్సై జిల్లాలో ఉన్న 2,620 మద్యం దుకాణాలకు మొత్తం 65,456 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ రోజు మద్యం దుకాణాల దరఖాస్తు కు అనుమతి లేదు. శని వారం రోజు లాటరీ ద్వారా దుకాణాలను కేటాయిస్తారు.
అయితే ఒక మద్యం దుకాణానికి సగటున 24 మంది పోటీ పడుతున్నారు. అయితే మద్యం దుకాణాల కు దరఖాస్తు చేయడానికి ప్రభుత్వానికి రూ. 2 లక్షల డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో మొత్తం వచ్చిన 65,456 దరఖాస్తు ల నుంచి తెలంగాణ ప్రభుత్వానికి మొత్తం రూ. 1400 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే ఈ ఏడాది మద్యం దుకాణాలను కేటాయించడానికి గౌడ, ఎస్ సీ, ఎస్ టీ కులాలకు తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్స్ ను కల్పించింది. దీంతో మద్యం దుకాణాలకు భారీ సంఖ్య లో దరఖాస్తులు వచ్చాయి.