ఎన్నికల వేళ పోలీసుల తనిఖీలు.. ఇప్పటివరకు రూ.165కోట్లు సీజ్

-

గత ఎన్నికల మాదిరి కాకుండా ఈ ఎన్నికల్లో ప్రలోభాలను కఠినంగా కట్టడి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర యంత్రాంగం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో భారీగా నగదు, బంగారు ఆభరణాలు, మద్యం, గంజాయి పట్టుబడుతోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 10 రోజుల్లోనే రాష్ట్ర పోలీసులు దాదాపు రూ.165 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

సరిహద్దుల్లో 148 చెక్‌పోస్టుల ఏర్పాటుతోపాటు ఏక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేస్తూ.. సరైన వివరాలు లేని నగదు, ఆభరణాలతో పాటు అక్రమంగా సరఫరా చేస్తున్న మద్యం, కానుకలు, గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఈనెల 9 నుంచి మొత్తం నగదు 77కోట్ల 87లక్షలు. సుమారు 9కోట్ల విలువైన మద్యం, ఏడున్నర కోట్ల గంజాయి పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. సరైన పత్రాలు లేని 62కోట్ల పైచిలుకు విలువైన  బంగారు, వెండి, వజ్రాభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 8.64కోట్ల విలువైన ల్యాప్‌టాప్‌, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడాసామగ్రి పట్టుబడినట్లు చెప్పారు. ఇక నగదు, వస్తువులు అన్ని కలిపి ఇప్పటి వరకు స్వాధీనమైన  సొత్తు విలువ 165కోట్ల 81లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version