Hyderabad: రీల్స్ చేస్తోందని భార్యను కొట్టి చంపిన భర్త !

-

Instagram రీల్స్ చేస్తోందని భార్యను కొట్టి చంపాడు ఓ భర్త. ఈ సంఘటన ఉప్పలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పల్ న్యూ భరత్ నగర్ హత్య కేసును ఛేదించారు పోలీసులు. భార్య మధుస్మితను హత్య చేసి.. సంచిలో చుట్టి బాత్ రూం దాచాడు భర్త ప్రదీప్ భోలా. రెండేళ్ల పాపను తీసుకుని ప్రదీప్ పరార్ అయ్యాడు. 12 గంటల్లో కేసు ఛేదించి.. ప్రదీప్ ను పట్టుకున్నారు పోలీసులు. ఓ హోటల్లో పనిచేస్తూ అద్దె ఇంట్లో ఉంటున్నారు ప్రదీప్ భోలా, మధు స్మిత.

Reels

అయితే… భార్య instagram రీల్స్ చేస్తూ.. అస్తమానం ఫోన్ పట్టుకునే కూర్చుంటుందని ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇక భార్యపై అనుమానం తో గొడవకు దిగాడు ప్రదీప్. అర్ధరాత్రి చపాతి పీటతో తలపై కొట్టడంతో స్పృహ కోల్పోయింది మధుస్మిత. అనంతరం చున్నితో ఆమె మెడకు బిగించి హత్య చేశాడు ప్రదీప్. మృతదేహాన్ని సంచిలో కుక్కి బాత్రూంలో ఉంచి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు ప్రదీప్. హత్య చేసిన 4 రోజుల తర్వాత ఈ విషయం బయటపడింది. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన రావడంతో గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఇక ఈ సంఘటనపై విచారణ చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news