“డాడీ లే డాడీ” అంటూ తండ్రి శవం ముందు కొడుకు ఆవేదన..వీడియో వైరల్

-

ఈ మధ్య కాలంలో గుండె పోట్లు ఎక్కువ అవుతున్నాయి. ఏజ్ తో సంబంధం లేకుండా.. గుండెపోట్లు వస్తున్నాయి. 3 వ తరగతి చదువుతున్న వారి నుంచి 80 ఏళ్ల వారికి అందరూ గుండె పోట్లు రావడం కామన్‌ అయిపోయింది. అయితే.. ఇటీవలే గాయకుడు, బీఆర్‌ఎస్‌ పార్టీ నేత సాయిచంద్‌ గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

అయితే.. ఈ సంఘటన మరువక ముందే.. బీఆర్‌ఎస్‌ పార్టీ లో మరో విషాదం చోటు చేసుకుంది. హుజూరాబాద్ బీఆర్ఎస్ నాయకుడు నందగిరి మహేందర్ రెడ్డి (39) గుండెపోటుతో మృతి చెందాడు. అయితే.. తండ్రి మరణం తట్టుకోలేక కొడుకు డాడీ లే డాడీ అంటుంటే ఆపడం ఎవరివల్ల కాలేదు. ఇంత చిన్న వయసులో ఈ గుండెపోటు మరణాలు ఏంటో బిక్కుబిక్కు పండుకుంటా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు డాడీ లే డాడీ అంటూ తండ్రి శవం ముందు కొడుకు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారడంతో.. అందరూ ఎమోషనల్‌ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news