ఈ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కి ఏమిచ్చినా తక్కువే…!

అంబులెన్స్ కి దారి ఇచ్చే విషయంలో కొందరు మానవత్వం లేకుండా వ్యవహరిస్తూ ఉంటారు. దీని వలన అనేక ఇబ్బందులు వస్తాయి. తాజాగా ఇలాంటి పరిస్థితి వచ్చిన సమయంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ మంచి మనసు చాటుకున్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ జి. బాబ్జీ హైదరాబాద్‌ లో బిజీగా ఉన్న ట్రాఫిక్ జామ్‌ ను క్లియర్ చేయడానికి రెండు కిలోమీటర్లు పరుగులు తీసారు.

అంబులెన్స్ కోసం అబిడ్స్ రోడ్ నుండి కోటి వరకు భారీగా ట్రాఫిక్ జాం ని ఆయన క్లియర్ చేసాడు. ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకోవడానికి కష్టపడుతున్న అంబులెన్స్ ముందు బాబ్జీ నడుస్తున్న వీడియో వైరల్ అయ్యింది. దీనిపై సీనియర్ అధికారులు ప్రసంశలు కురిపించారు. సోమవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. అంబులెన్స్ లోపల రోగి ఇబ్బంది పడటంతో వెంటనే బాబ్జి తనను అనుసరించమని అంబులెన్స్ డ్రైవర్‌ నుకు సూచించి వాహనం ముందు పరిగెత్తుకుంటూ ట్రాఫిక్ జామ్‌ ను క్లియర్ చేశాడు.