వివాదంలో సవాంగ్ కుమారుడు.. ఓ యువతి విషయంలో రెండు వర్గాల గొడవ… !

-

crime : హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఓ పబ్ ఎదుట బుధవారం రాత్రి రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో పాల్గొన్న ఓ వర్గంలో సిద్ధార్థ మాగ్నమ్ ఉండగా… మరో వర్గంలో ఏపీ మాజీ డిజిపి గౌతమ్ సవాంగ్ కుమారుడు డేవిడ్ సవాంగ్ ఉన్నట్లు సమాచారం. పబ్ లో వీరి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.

 

Hyderabad David Sawang Son Of Former DGP Of Andhra Pradesh Gautham Sawang Has Beaten A Youth
Hyderabad David Sawang Son Of Former DGP Of Andhra Pradesh Gautham Sawang Has Beaten A Youth

కాసేపటి తర్వాత బయటకు వచ్చి మద్యం మత్తులో ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగినట్లు సమాచారం. ఈ ఘటనలో సిద్ధార్థ, డేవిడ్ కు గాయాలయ్యాయి. దాడుల గురించి సమాచారం అందడంతో జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఇరు వర్గాలు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news