మ‌త్తు వీడ‌ని ఓట‌రు… బాధ్య‌త లేని యువ‌త‌

-

గ్రేట‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారం ఎంత‌టి వేడిని ర‌గిల్చిందో చూశాం.. నువ్వొ ‌క‌టంటే నేను వందంటా అన్నంత‌గా సాగింది ఎన్నిక‌ల ప్ర‌చార‌ప‌ర్వం. తీర పోలింగ్ రోజున చూస్తే సీన్ సితారైంది. నెమ్మ‌మ్మమ్మ‌దిగా మొద‌లైన ఓటింగ్ మ‌ద్యాహ్నం వ‌ర‌కు పుంజుకోలేక‌పోయింది. కొన్ని చోట్ల ఒక్క శాతం మించ‌లేదంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది.

విద్యా వేత్త‌లు, మేధావులు, అప‌ర మేధావుల నిల‌య‌మైన గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో సామాజిక బాధ్య‌త క‌లిగిన వారంటూ లేరు. ఇది ప్ర‌తీ ఎన్నిక‌ల్లో క‌నిపించేదే కానీ ఇప్పుడు జ‌రుగుతున్న గ్రేట‌ర్ ఎల‌క్ష‌న్స్‌లో అది ఘోరంగా ఉంది. ఎన్నిక‌లంటే హాలిడేస్ అన్న‌ట్లుగా ఎంజాయ్ చెయ్య‌డానికి సొంతూర్ల‌కు ప‌య‌న‌మైన సెటిల‌ర్ల విజ్ఞ‌త ఎంత‌?? ఎన్నిక‌లంటే ఆఫీస్‌కి హాలిడే అనుకునే యువ‌త‌ను ఏమ‌నాలి. హైద‌రాబాద్‌లో ఎటు చూసినా చేతుల్లో ఫైల్స్ ప‌ట్టుకు తిరిగే ఉద్యోగులెక్క‌డ‌…? వ‌ర‌ద‌లు మా గ‌డ‌ప‌లోకొచ్చాయంటూ ధ‌ర్నాలు చేసే స‌గ‌టు జీవి ఎక్క‌డికి పోయాడు. ఎవ‌రు నిన్ను పాలించాలో డిసైడ్ చేసుకునే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు ఇంటికే ప‌రిమిత‌మైతే రేపు మీరు ఎవ‌ర్ని ప్ర‌శ్నించ‌గ‌ల‌రు.

ఏది ఏమైనా పోలింగ్‌లో న‌మోదైన ఓటింగ్ శాతం చూస్తే అవ్వాక్క‌వాల్సిందే.. ఒక్క శాతం దాట‌ని పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. అన్నింటికీ మించి ప‌ట్ట‌ణ శివారు ప్రాంతాలే న‌యం అనిపించేలా ఉన్నాయి.

అమీర్‌పేట్‌లో 48,268 మంది ఓటర్లు ఉంటే కేవలం 379 మంది (0.79%) త‌మ ఓటు హ‌క్కును వినియోగించ‌గా, జూబ్లీహిల్స్ సర్కిల్‌లోని షేక్‌పేట పోలింగ్ కేంద్రాల పరిధిలో 63,230 మంది ఓటర్లుకుగాను కేవలం 1,658 మంది (2.62%) మాత్రమే ఓటు వేశారు. రెయిన్ బజార్‌ డివిజన్‌లో కేవలం 240 మంది మాత్రమే ఓటువేశారు ఇది కేవలం 0.56% శాతం మాత్ర‌మే. తలాబ్ చంచలం డివిజన్‌లో కేవలం 332 మాత్రమే (0.74%) ఓటు వేశారు. ఇక బేగం బజార్‌లో 3.85%, సోమాజీగూడలో 2.77%, కుత్బుల్లాపూర్ సర్కిల్‌లోని సుభాష్‌నగర్‌లో 3.85% అత్తాపూర్‌లో 3.85% , జియాగూడ, కార్వాన్ డివిజన్లలో 3.85%, చంద్రాయణ్‌గుట్ట సర్కిల్‌లోని కంచన్‌బాగ్‌లో 2.13%, శాలిబండలో 3.85%, దబీర్‌పురలో 5.39%, చొప్పున మాత్రమే పోలింగ్ నమోదైంది.

రామచంద్రాపురం, పటాన్‌చెరు, భారతీనగర్, చిలకానగర్, హస్తినాపురం, మూసాపేట్ సర్కిల్‌లోని అల్లాపూర్, గాజులరామారంలోని జగద్గిరిగుట్ట డివిజన్‌లో 42.94%, గుడిమల్కాపూర్‌లో 49.19%, గోషామహల్ సర్కిల్‌లోని దత్తత్రేయనగర్‌లో 40.86% చొప్పున అత్యధికంగా పోలింగ్ నమోదైంది.

క‌రోనా రోజుల్లో కూడా ఇంత‌క‌న్నా ఎక్కువ‌మందే బ‌య‌ట తిర‌గ‌టానికి ప్ర‌య‌త్నించారు. చ‌దివేస్తే ఉన్న మ‌తి పోయింద‌న్న‌ట్లుంది హైద‌రాబాదీల ప‌రిస్థితి. చ‌దువు నేర్పిన విజ్ఞ‌త ఇదీ. ఇదీ ప్ర‌జ‌ల‌ను ఎడ్యుకేట్ చేసిన వ్య‌వ‌స్థ‌..

Read more RELATED
Recommended to you

Latest news