హైదరాబాద్ లో రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతోంది. నగరంలో ట్రాఫిక్ తగ్గించేందుకు మెట్రోను ప్రారంభించారు. మూడు కారిడార్లలో హైదరాబాద్ మెట్రో సేవలు అందిస్తోంది. మియాపూర్- ఎల్బీనగర్, నాగోల్-రాయ్ దర్గ్, జేబీఎస్- ఎంజీబీఎస్ రూట్లలో మెట్రో తన సేవలను అందిస్తోంది. మెట్రో వల్ల నగరంలో ఎంతో కొంత ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతున్నాయి. ప్రజలు తమ గమ్యస్థానాలకు త్వరగా, సకాలంలో చేరుతున్నారు. ప్రజల కోరిక మేరకు ఇటీవల మెట్రో టైమింగ్స్ కూడా పెంచారు. ఉదయం 6 నుంచి రాత్రి 10.15 వరకు మెట్రో నడుస్తోంది.
ఇదిలా ఉంటే మరో కీలక నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ మెట్రో. ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా ఐటీ కంపెనీలు తెరుచుకోవడంతో మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంద. గతంలో రోజుకు 2.20 లక్షల మంది ప్రజలు మెట్రోలో ప్రయాణించగా… ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య 2.75 లక్షలకు చేరింది. దీంతో పెరుగుతున్న రద్దీని ద్రుష్టితో పెట్టుకుని ఐటీ కారిడార్ వైపు ప్రతీ 3 నిమిషాలకు ఓ ట్రైన్ నడిపేలా ఏర్పాట్లు చేశారు.